Site icon NTV Telugu

AP DSC Notification: రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

Botsa Satyanarayana

Botsa Satyanarayana

AP DSC Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందంటూ ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. దీనిపై పలు సందర్భంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.. అయితే, డీఎస్సీపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తోందని స్పష్టం చేశారు.. దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.

Read Also: TS 6 Guarantees: ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు

ఇక, అంగన్వాడీల సమ్మెపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి వెంటనే వేయి రూపాయాలు పెంచుతాం అని హామీ ఇచ్చాం.. అదే మాదిరిగా రూ.11 వేలు ఇచ్చాం అన్నారు. పది డిమాండ్లు ఒప్పుకున్నాం.. ఇప్పుడు అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలకు వెళ్తున్నాం కావున.. ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.. మరోవైపు, బెల్ట్ షాపులు చంద్రబాబు టైమ్ లో వచ్చాయి వాళ్లని అడగండి.. అని నిలదీశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏదో చెబుతాడు.. దానికి ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేడని దుయ్యబట్టారు. ట్యాబ్‌ల కొనుగోలు విషయంలో.. ఏడు వందల కోట్లు‌. అన్నీ కలిపితే పద్నాలున్నర కోట్లు.. అంతే గాని వందల కోట్లు అవినీతి అని చెప్పాడం సిగ్గు అని మండిపడ్డారు.

Read Also: A Ranjith Cinema : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ మూవీ..

మరోవైపు.. స్థానిక పరిణామాలు బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజం అన్నారు మంత్రి బొత్స.. రాజకీయాల్లో ఆత్మహత్యలే గానీ.. హత్యలు ఉండాహత్యలే ఆత్మహత్య ఉండవు అని వ్యాఖ్యానించారు. సంక్షేమ కార్యక్రమాలు చూసి అన్నీ బాగున్నాయంటేనే నాకు ఓటేయ్యండి అని సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నాడు.. కానీ, చంద్రబాబు లాగా చెప్పి మోసం చేయలేదన్నారు.. జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుంది.. మార్పు ఉండబోదని నమ్మకం.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయ మాత్రమే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version