గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ తప్ప.. వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ డ్రైనేజీ పనులు కూడా చేయ లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. జుర్రెరు వాగు నీరు కలుషితం కాకుండా 30 నెలల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనులు పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం అని మంత్రి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో రూ.30.66 కోట్ల వ్యయంతో జుర్రేరు వాగు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు నేడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు.
జుర్రేరు వాగు అక్రమ నిర్మాణాలను తొలగించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ‘జుర్రేరు వాగుకు ఇరు వైపుల 3.60 కిమీ ఓపెన్ డ్రైనేజీ, 56 కిమీ భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతాం. గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ తప్ప.. వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ డ్రైనేజీ పనులు కూడా చేయలేదు. జుర్రెరు వాగు నీరు కలుషితం కాకుండా 30 నెలల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనులు పూర్తి చేస్తాం. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం. బనగానపల్లె పట్టణ ప్రజల రుణం తీర్చు కునేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులు అంకితం చేస్తాం’ అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు.