ఏపీలో కందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటన పై అధికార పార్టీ నేతలు టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు ( మం ) మంచినీళ్ల పేటలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చివలన ప్రకాశం జిల్లా కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు. గతంలో పుష్కరాలలో ఎలాగైతే చనిపోయారో ఇప్పుడు అలానే జరిగింది….గతంలో జరిగిన పుష్కరాలలో 36 మంది చనిపోతే..
చంద్రబాబు ఏమన్నాడో తెలుసా..?
కుంభమేళాలో చచ్చిపోలేదా..? యాక్సిడెంట్స్ లో చూచ్చిపోలేదా..? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది చనిపోయారు…కేవలం చంద్రబాబు గొప్పను చూపించడం కోసం టీవీల్లో జనాలను చూపించడం కోసం ఇదంతా చేశారు. తన వాళ్లతో ఎనిమిది మందిని తొక్కించి చంపేచాడని సంచలన వాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఖచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి అప్పలరాజు. మరోవైపు పర్యాటక మంత్రి రోజా కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Read ALso: Chandrababu : విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి
ఇరుకు రోడ్డులో సభ పెట్టి, డ్రోన్ కెమెరాతో వీడియోలు తీసి.. బాబు సభకు కిక్కిరిసిన జనం అని ఎల్లో మీడియాలో భజన చేయించుకోవాలని చూశాడని, ఆ పబ్లిసిటీ పిచ్చితోనే 8 మందిని బలితీసుకున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, 8 మందిని పొట్టన పెట్టుకున్న బాబును ఏం అనాలని ప్రశ్నించారు. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, 8 మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరపాలని ఆమె కోరారు.
Read ALso: Lionel Messi: మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు.. వీడియో వైరల్..