Minister Anam Ramanarayana Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి.. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ ఏకగ్రీమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాగునీటి సంఘాలు ఎన్నికలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని.. అప్పట్లో ఆ ప్రభుత్వానికి ధైర్యం లేదన్నారు.
ఇక, సోమశిల ప్రాజెక్టు దెబ్బ తినడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి ఆనం విమర్శించారు.. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణకు 7 కోట్ల రూపాయలు నిధులు అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని.. అందువల్లే అది వరదల్లో.. కొట్టుకుపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు.. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను కూడా చేపట్టలేదని.. కేవలం భూ పరిహారంలో మాత్రమే రైతులను మభ్యపెట్టారన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. మరోవైపు.. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే కాగా.. అసలు, కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహారిస్తుందంటూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే.. అయితే, ఆ ప్రకటన చేసినా.. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు.