NTV Telugu Site icon

Minister Satya Prasad: మదనపల్లె ఫైళ్ల దహనం ఘటనలో కుట్ర కోణం.. సీఐడీ విచారణలో తేలుస్తాం!

Anagani

Anagani

Minister Anagani Satya Prasad: మదన పల్లె ఫైళ్ల దహనం ఘటన కుట్ర కోణంలో జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సీఐడీ విచారణలో దోషులను కచ్చితంగా తేలుస్తామని తేల్చి చెప్పారు. పెద్దిరెడ్డే కాదు…అంతకన్నా పెద్ద వారు ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు తగులపెట్టించి అమాయక ముఖం పెడితే నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన విమర్శించారు. పెద్దిరెడ్డి, అతని అనచరులకు వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. పాపాలు చేసి ఫైళ్లు తగులబెట్టడడం అలవాటుగా చేసుకున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. .మదన పల్లె.. అంతకు ముందు కాలుష్య నియంత్రణ మండలిలోనూ ఫైళ్లు తగలబెట్టారని ఆయన చెప్పారు.

Read Also: Pawan Kalyan: అందుకే నేత వస్త్రాలను ధరిస్తున్నాను.. కీలక ప్రకటన చేసిన పవన్‌ కళ్యాణ్

Show comments