Ambati Rambabu: వాస్తవాలు చెప్తే ఉరేసుకుని చస్తావ్.. చంద్రబాబు!.. నీ చిట్టా అంతా నాకు తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి “ఇదేమీ ఖర్మ తెలుగు దేశానికి..” అనేది సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు. చంద్రబాబు ప్రారంభించిన బాదుడే బాదుడును ప్రజలే తిప్పికొట్టారని తెలిపారు. టీడీపీ పార్టీ నాయకులు కూడా బాదుడే బాదుడు కార్యక్రమం ఘోరంగా విఫలం అయ్యిందని చెప్పారని ఆయన వెల్లడించారు. పాత పాటే మళ్ళీ పాడాడన్న ఆయన.. హైదరాబాద్ నేనే కట్టా, ఐటీ తెచ్చా అంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వదిలి రాకపోవడం టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. కాపర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టిన దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబుది అంటూ విమర్శించారు.
కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును నేనే కడతాను అనటానికి కారణం ఏంటో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. తాను వస్తే ఇప్పుడు ఉన్న పథకాలు తీయను అని చంద్రబాబు అంటున్నాడని.. అంటే జగన్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తున్నట్లే కదా అని మంత్రి పేర్కొన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయపడటమే చంద్రబాబు ఖర్మ అని ఆయన అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై అంబటి ఫైర్ అయ్యారు. తనను గంట, అరగంట మంత్రి అన్నందుకు తీవ్ర స్థాయిలో స్పందించారు. చంద్రబాబుకు సంస్కారం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నేతగా సంజయ్ గాంధీ దగ్గర చంద్రబాబు ఎన్ని బ్రోకర్ పనులు చేశాడో తన దగ్గర చిట్టా ఉందని ఆయన అన్నారు.
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
Nara Brahmani : వావ్.. నారా బ్రహ్మణిలో మరో టాలెంట్.. లడక్‌లో బైక్ రైడింగ్ వీడియో..
అంజయ్య కేబినెట్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్ బ్యాగులు, సూట్ కేసులు మోసావ్ అంటూ వ్యాఖ్యానించారు. నీ పెళ్ళి సంగతి తెలుసు.. నీ కుటుంబం గురించి తెలుసు.. మీ రామ్మూర్తి నాయుడు గురించి, నీ భార్య గురించి, కొడుకు గురించి తెలుసు.. ఒక్క నిమిషం సంస్కారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే ఉరేసుకుని చస్తావ్ చంద్రబాబు అంటూ అంబటి సెటైరికల్ కామెంట్స్ చేశారు. నీ కుటుంబం గురించి మాట్లాడితే ఉరేసుకుని చస్తావ్ అంటూ మంత్రి అన్నారు. నోరు అదుపులో పెట్టుకో.. నోరు జారితే ఉరేసుకుని చచ్చే విషయాలు బయటపెడతానంటూ మండిపడ్డారు. జగన్ నవ్వుతున్నా చూసి ఏడ్చే ఖర్మ చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావటం అసంభవమన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను చంపేస్తామా??.. రాజకీయంగా ఏమున్నారని చంపటానికి అంటూ సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!