NTV Telugu Site icon

Ambati Rambabu: పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి సెటైర్లు..

Ambati Rambabu

Ambati Rambabu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా..! సీఎం అంటే చీఫ్ మినిస్టరా..?అని ప్రశ్నించారు. సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా..? సీఎం అంటే చంద్రబాబు మనిషా..? సీఎం అంటే చీటింగ్ మనిషా..? అని ట్విట్టర్ వేదికగా కాపు వర్గాన్ని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే.. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయి పొత్తులపై చర్చించిన సంగతి తెలిసిందే.. ఆ చర్చలు ఫలించాయి కూడా… ఇవాళ ఢిల్లీ నుంచి సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు పొత్తులపై విరుచుకుపడ్డారు.

Show comments