NTV Telugu Site icon

Ambati Rambabu: లోకేశ్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్.. పాదయాత్రతో ఒరిగిందేమీ లేదు

Ambati

Ambati

టీడీపీ నేత లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్ అని అన్నారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేదేమీ లేదని మంత్రి ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో అధికారంలోకి రాదని తెలిపారు.

Direct Tax Collection: ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తున్న ప్రత్యక్ష పన్నులు.. ఆగస్ట్ 10నాటికి రూ.6.53లక్షల కోట్లు

మరోవైపు లోకేష్‌కు సరిగా తెలుగు మాట్లాడడం రాదని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. ఓ అధినేత కొడుకుగా మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యాడన్నారు. ముందు ఎమ్మెల్యేగా గెలుపొందాలని మంత్రి లోకేష్ కు సూచించారు. ఇక తన కుటుంబ సభ్యులు ఎప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. ఎన్నికల సమయంలోనే తన సోదరుడు, బిడ్డలు, అల్లుళ్లు వస్తారని.. ఎన్నికలు అయిపోగానే వారు వెళ్లిపోతారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు తన కుటుంబ సభ్యులు మళ్లీ వస్తారంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.

Anirudh Ravichandran: ఏం తాగి కొడుతున్నావయ్యా.. మ్యూజిక్.. మెంటల్ ఎక్కిపోతుంది థియేటర్ అంతా

ఇక మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీఎం జగన్ చెడగొడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీఎం జగన్ నిలబెట్టారన్నారు. మరోవైపు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే నైజం కన్నా లక్ష్మీనారాయణదని విమర్శించారు. టీడీపీలో కూడ కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ రోజులు ఉండడని అంబటి రాంబాబు పేర్కొన్నారు.