Site icon NTV Telugu

Minister Amarnath: వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై మంత్రి అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

Minister Amarnath

Minister Amarnath

Minister Amarnath: ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల వైసీపీలో ఇంఛార్జులను సీఎం జగన్‌ మార్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు అసంతృప్తి గళం విప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై అనకాపల్లిలో మంత్రి అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: MLC Vamshikrishna: వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్?

రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్లు మార్పు ఉంటుందని ముఖ్యమంత్రి ముందే మాకు స్పష్టం చేశారని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ముఖ్యమంత్రికి 175 మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమన్నారు. మా సీటు మార్చినా పోటీ చేయొద్దు అన్న పార్టీకి కట్టుబడి ఉంటామని.. ముఖ్యమంత్రి ప్రకటించింది నియోజకవర్గం ఇంఛార్జులను మాత్రమే ఎమ్మెల్యే సీట్లు కాదన్నారు. బీఫాం ఇస్తేనే సీట్లు ప్రకటించినట్టు అంటూ మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

Exit mobile version