ఏపీలో ప్రతి కుటుంబానికి జగనన్న మేలు చేశారన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. పదివేల కోట్ల రూపాయల భారం మోస్తూ రూపాయి కే 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు ఇస్తున్నాం.టిడ్కొ ఇల్లలో అనేక సంస్కరణ లు తీసుకువచ్చారు. మౌళిక వసతులు లేకుండా ఇల్లు కేటాయించకూడదని బావించడంతో కాస్త ఆలస్యం అయిందన్నారు. రాజకీయ లబ్ది కొసం తూతూ మంత్రంగా టిడిపి నాడు ఇళ్ళు నిర్మించారు.ప్రతిఒక్క కుటుంబంలో జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగింది. చంద్రబాబు14 ఏండ్లు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పడు మహిళలను , యువతని మోసం చేసారన్నారు.
Read Also: Maoist letter : వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం
40 ఏండ్లు ఇండస్ట్రి అని చెబుతున్న వ్యక్తి చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.చంద్రబాబు తాను అధికారంలో ఉన్నసమయంలో ఏం చెయకుండా , నేడు మరో ఛాన్స్ అంటున్నారు.పవన్ కి ఆలోచనా విధానం , భావజాలం లేదు.ఇంకా చట్టసభల్లో అడుగుపెట్టలేదు . సిఎంగా ఒక అవకాశం అంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో , ఏమి చేస్తానని చెప్పలను కుంటారో తెలియని పరిస్దితి పవన్ ఉన్నారు. మీకుటుంబంలో మంచి జరిగిందా లేదా చూసుకొని , మీకు నమ్మకం ఉంటేనే జగన్ వైపు ఉండాలని కోరుతున్నాం. అక్కచెల్లెమ్మలు జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకొవాలన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Read Also: Lakshmi Parvathy: చంద్రబాబుని రజనీకాంత్ ఎలా సపోర్ట్ చేస్తాడు?