Google vs Teachers: కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా.. దాని గురించి చెప్పడానికి ఓ గురువు కావాలి.. అందుకే గురువుకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.. పుస్తకాలను చూసి పాఠాలను చెప్పడమే కాదు.. జీవితాలను చూసి బోధించేవారు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు.. ఇక, ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ, గురువు స్థానాన్ని మాత్రం ఎప్పటికీ గూగుల్ భర్తీ చేయలేదంటూ గతంలోనే భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. నేడు, ప్రపంచం శరవేగంగా దూసుకుపోతోంది.. మీకు గూగుల్ అందుబాటులో ఉన్నా సరే.. మీకో గురువు అవసరం.. గురువును గూగుల్ భర్తీ చేయలేదు అంటూ ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అయితే, దీనికి భిన్నంగా.. అది కూడా ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి..
Read Also: Skanda Release Date: సలార్ ఎఫెక్ట్.. వెనక్కి స్కంద! రిలీజ్ ఎప్పుడో తెలుసా?
గురువుల కన్నా గూగుల్లో ఎక్కువ మెటీరియల్ లభిస్తోందంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవ సభలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీచర్లను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బైజూస్ తో టెక్నాలజీ మొత్తం ట్యాబుల్లో అందు బాటులో ఉందన్నారు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని, ఉపాధ్యాయులకు తెలియని అంశాలు కూడా గూగుల్‌లో కొడితే వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. గూగుల్ వచ్చిన తర్వాత గురువులు అవసరం లేని పరిస్థితి ఏర్పడిందంటూ మంత్రి సురేష్ వ్యాఖ్యానించడంపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.