Site icon NTV Telugu

Adimulapu Suresh: సీఎం జగనే వైఎస్‌ వివేకా కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారు..

Adimulapu Suresh

Adimulapu Suresh

Minister Adimulapu Suresh: వైఎస్‌ వివేకా హత్య కేసుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. సీఎం జగనే కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారని.. ఎవరైతే దోషులు ఉన్నారో వారు బయటకు రావాల్సిందేనన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాకు ఎన్నిసార్లు వచ్చారు.. ఏం చేశారో చెప్పి జిల్లా పర్యటనకు రావాలని మంత్రి అన్నారు.

Read Also:
Dancing Cop : హీరోలెక్క స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్
వెలిగొండ ప్రాజెక్టుపై ఐదేళ్లు కాలయాపన చేశాడని ఆయన విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ది లేకుండా ఇప్పుడు గాలిమాటలు చెప్పటానికి వస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కాకమ్మ కబుర్లు చెప్పటానికి పర్యటనకు వస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా ఐదేళ్లు వెలిగబెట్టి తగుదునమ్మా అని రావటానికి సిగ్గులేదా అంటూ మంత్రి మండిపడ్డారు. వైఎస్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్ధాపన చేశారని.. ప్రాజెక్టును పూర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version