Site icon NTV Telugu

Minelle Farooqui: పాక్ లో అతి పిన్న వయస్కురాలైన కమర్షియల్ పైలట్.. సవాల్ చేస్తూ ఆకాశానికి ఎగిరిన మినెల్లే ఫారూఖీ

Minelli Farooqi

Minelli Farooqi

పాకిస్తాన్ గురించి చెప్పమంటే మంచి కంటే చెడే ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే ఆ దేశం తీరు అలా ఉంటుంది కాబట్టి. ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ అండగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాక్ పై ప్రశంసలకు బదులుగా విమర్శలే ఎక్కువ. అయితే ఫస్ట్ టైమ్ ఓ యువతి కారణంగా పాక్ గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ పితృస్వామ్య సమాజాన్ని సవాలు చేస్తూ 18 ఏళ్ల అమ్మాయి తన లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్ అతి పిన్న వయస్కురాలైన కమర్షియల్ మహిళా పైలట్ అయింది మినెల్లే ఫరూకీ.

Also Read:Chandu Nayak: చందు నాయక్ కాల్పుల కేసులో.. సంచలన విషయాలు వెల్లడించిన సౌత్ ఈస్ట్ డిసిపి

మినెల్లే కేవలం 18 సంవత్సరాల వయసులోనే విమానయానం చేయాలనే తన కలను సాధించింది. ఆమె పాకిస్తాన్‌లో అత్యంత చిన్న వయసు వాణిజ్య పైలట్ అయ్యారు. తన విజయం గురించి మాట్లాడుతూ, మినెల్లే తనకు చిన్నప్పటి నుంచి విమానయానం అంటే ఇష్టమని చెప్పింది. మినెల్లే ప్రకారం, విమాన ప్రయాణమంటే నాకున్న ప్రేమ నా DNA లోనే ఉంది. మొదటి నుంచీ నాకు విమానాన్ని చూడాలనే ఆసక్తి ఉండేది. నా ఇల్లు కరాచీ రన్‌వేకి చాలా దగ్గరగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి విమానాలు టేకాఫ్ అవ్వడం, ల్యాండ్ అవ్వడం చూస్తున్నాను. నేను కూడా పెద్దయ్యాక పైలట్ కావాలని కోరుకున్నానని తెలిపింది.

Also Read:YSRCP: తాడిపత్రిలో వైసీపీ సమావేశం తాత్కాలికంగా వాయిదా.. కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

మినెల్లే, కేవలం ఏడాది వ్యవధిలోనే 13 విమానయాన పరీక్షలలో ఉత్తీర్ణురాలయ్యింది. మినెల్లే మాట్లాడుతూ.. అమ్మాయిలకు మాత్రమే కాదు అందరికీ నా సందేశం ఏమిటంటే, మీరు దేనిపైనా మక్కువ కలిగి ఉంటే, దానిని ఖచ్చితంగా అనుసరించండి. మిమ్మల్ని వెనక్కి లాగడానికి 100 మంది వ్యక్తులు ఉంటారు. పురుషాధిక్యం లేని వృత్తులలో కూడా, మీరు ముందుకు సాగకుండా ఆపేవారు చాలా మంది ఉంటారు అని తెలిపింది. మినెల్లే ఫారూఖీ ప్రస్తుతం ఎయిర్ అంబులెన్స్ నడుపుతోంది. మినెల్లే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ కావాలని కలలు కంటుంది.

Exit mobile version