Tamannah : మరోసారి స్పెషల్ సాంగ్ తో సందడి చేయనున్న మిల్కీ బ్యూటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో 2018 లో విడుదల అయిన ‘స్త్రీ’ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది.కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘భేదియా’ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ అమర్ కౌశికే స్త్రీ సినిమాను కూడా తెరకెక్కించాడరు.. అంతేకాకుండా స్త్రీ మూవీ తోనే డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.తొలి సినిమాతోనే అమర్ కౌశిక్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఇక స్త్రీ మూవీ లో రాజ్‌కుమర్ రావు మరియు శ్రద్ధా కపూర్ తమ పర్‌ఫార్మెన్స్‌తో అదరిగొట్టేశారు.కీలక పాత్రలో నటించిన పంకజ్ త్రిపాటి అద్భుతంగా నటించారు.. మొత్తంగా 2018లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాల్లో ఒకటిగా స్త్రీ నిలిచింది.ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ‘స్త్రీ 2’ అంటూ సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కూడా అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాలిడ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది మిల్కీ బ్యూటీ తమన్నా ‘వా.. నువ్వు కావాలయ్యా’ అంటూ ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్‌తో స్టెప్పులు సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో తమన్నా క్రేజ్ ఎంతగానో పెరిగింది.తమన్నా తన డాన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. తమన్నా కు వున్న క్రేజ్ కారణంగా’ స్త్రీ 2′ మూవీ లో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది.దీనితో తమన్నా మరోసారి తన డ్యాన్సుతో సందడి చేయడానికి ముస్తాబవుతుంది.అయితే ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!