Site icon NTV Telugu

Bollywood : హిందీలో ఆరు సినిమాలతో షేకాడిస్తున్న పాల బ్యూటీ

Thammu

Thammu

విజయ్ వర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేశాయి. కెరీర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టింగ్ ఛేంజస్ చూస్తోంది. వెయిట్ లాసైన గ్లామర్ బ్యూటీ కెరీర్‌పై మళ్లీ కాన్సట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామికా గబ్బీల లైనప్ వేరే లెవల్ అనుకుంటే వాళ్లను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓ వైపు ఐటమ్ సాంగ్స్.. మరో వైపు హీరోయిన్‌గా వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉంది.

Also Akhanda2 Censor Review : అఖండ 2 సెన్సార్ టాక్.. చూస్తారుగా బోయ ఆడించే ఆట

బాలీవుడ్‌లో తమన్నా ఫెయిల్యూర్స్ చూసినా ఆమెకు మంచి ఆఫర్లనే కట్టబెడుతోంది నార్త్ బెల్ట్.. షాహీద్ కపూర్ ఓ రోమియో, అజయ్ దేవగన్, సంజయ్ దత్ రేంజర్, రాగిణి ఎంఎంఎస్3, రోహిత్ శెట్టి అన్ టైటిల్డ్ ఫిల్మ్‌తో పాటు సిద్ధార్థ్ మల్క్షోత్రా వివాన్ చిత్రాల్లో నటిస్తోంది బ్యూటీ. ఇదే కాకుండా మరో మూవీని లైన్లో పెట్టిందట. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా హిందీలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు సిద్దాంత్ చతుర్వేది. రీసెంట్లీ అతడి ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీం. ఈ ప్రాజెక్టుకు రీసెంట్లీ సైన్ చేసిందట తమన్నా. ఇక ఈ ఏడాది తెలుగు, హిందీలో చేసిన సినిమాలు వెబ్ సిరీస్ కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయనప్పటికీ ఐటమ్ సాంగ్స్‌తో కవర్ చేసేసింది తమన్నా. రైడ్2, బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ లేపింది తమ్ము. హీరోయిన్‌గా ఆమెకు ఛాన్సులు తెచ్చిపెట్టడం, ఐటమ్ నంబర్ ఆయుధంగా మారడంతో వాటిని వదల్లేకపోతోంది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా నో చెప్పడం లేదు. అందుకే మన శంకర్ వర ప్రసాద్ గారులోనూ చిరుతో స్టెప్పులేసిందట. అలాగే రాజాసాబ్‌లో కూడా డార్లింగ్‌తో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిందన్న టాక్ నడుస్తోంది. ఇక తమిళంలోనూ విశాల్- సుందర్‌తో మరోసారి కొలబరేట్ అవుతోంది మిల్కీ బ్యూటీ. ఈ లైనప్ చూస్తుంటే.. నెక్ట్స్ ఇయర్ తమన్నా.. మిగిలిన భామలకు కాంపిటీషన్ అయ్యేట్లుగానే కనిపిస్తోంది.

Exit mobile version