తెలంగాణలోని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కొన్ని సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులు ఇళ్లలో నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కొద్దసేపు భూ ప్రకంపనలు వచ్చినట్లు ప్రజలు తెలిపారు. కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాలకు చెందిన ప్రజల తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. తాము ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లుగా వారు తెలిపారు.
Also Read : Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. మరోవైపు తెలంగాణ సరిహద్దు పంచుకున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఒక సెకను పాటు భూమి కంపించినట్లుగా అక్కడి ప్రజలు వెల్లడించారు. గతంలో కూడా బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.తరుచు ఇలా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయి
యాదృచ్చికంగా, సరిహద్దు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాలో కూడా ఈ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో సోమవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. కచ్ లో తేలికపాటి భూప్రకంపనలు సంభవించడం సాధారమే అని అధికారులు తెలిపారు.