Site icon NTV Telugu

Microsoft Layoffs: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ బిగ్ షాక్.. ఏకంగా 9 వేల మందికి లేఆఫ్‌ నోటీసులు

Microsoft

Microsoft

Microsoft Layoffs: టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగులను బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌ నోటీసులు జారీ చేస్తునట్లు తెలుస్తుంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు ప్రకటించడం ఇది సెకండ్ టైమ్. అయితే, ఈసారి ఎంత మందిపై వేటు పడనుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కాగా, దాదాపు 4 శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం చూపనుందని పేర్కొనింది. ఇక, కొన్ని మీడియా ఛానల్స్ కథనాల ప్రకారం దాదాపు 9 వేల మందికి పైగా లేఆఫ్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది.

Read Also: BJP: ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్ ఇదే..

అయితే, జూన్‌ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో ఎంప్లాయిస్ తొలగింపులను మొదలు పెట్టిన దిగ్గజ సంస్థ.. ఈ ఏడాది మే నెలలో 6 వేల మందికి లేఆఫ్‌లు జారీ చేసింది. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో 4 శాతం.. అంటే దాదాపు 9,100 మంది ఎంప్లాయిస్ పై ప్రభావం పడనున్నట్లు సమాచారం.

Exit mobile version