ICC Cricket World Cup: సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు దక్కని చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Vaughan predicts 4 Semifinalists of ICC Cricket World Cup 2023: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా ‘ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023’ ఫీవర్‌తో ఊగిపోతోంది. మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ 2023 మరో కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో ఏ జట్లు బలంగా ఉన్నాయి, ఏ టీమ్స్ సెమీస్‌కు చేరతాయి?, ఏ జట్టు టైటిల్‌ను గెలుస్తుంది? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు కూడా ప్రపంచకప్ 2023 ఎప్పుడెప్పుడూ ప్రారంభమవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఏ జట్లు సెమీస్ చేరతాయి?, ఏ జట్టు టైటిల్‌ను గెలుస్తుంది? అనే దానిపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన అంచనాలను తెలిపాడు. ‘ఈ వారం ప్రపంచకప్ 2203 ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేను. నా అంచనా ప్రకారం.. భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరతాయి అని వాన్ ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ జాబితాలో బలమైన టీమ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
Also Read: ICC Cricket World Cup: సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం!
ఉపఖండ పిచెస్ కాబట్టి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్‌కు చేరుతాయని మైఖేల్ వాన్ అంచనా వేశాడు. ఇక భారత జట్టుపై వాన్ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచకప్ 2023లో భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్‌ను గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. స్వదేశీ పిచ్‌లపై భారత బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉందని, వారి బౌలింగ్ ఆప్షన్లు అన్ని కవర్ అయ్యాయని పేర్కొన్నాడు. ఒత్తిడి మాత్రమే భారత్‌ను ఆపగలదని చెప్పాడు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!