Site icon NTV Telugu

‘Michael’ Trailer Out: మళ్లీ తిరిగొచ్చిన ‘కింగ్ ఆఫ్ పాప్’.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ అదుర్స్!

'michael' Trailer

'michael' Trailer

సంగీత ప్రపంచాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు తన డ్యాన్స్‌తో, పాటలతో ఊపేసిన ఏకైక వ్యక్తి మైఖేల్ జాక్సన్. ఆయన చనిపోయి 25 ఏళ్లు దాటినా, నేటికీ ఆ మేజిక్ తగ్గలేదు. ఇప్పుడు ఆ లెజెండ్ ప్రయాణాన్ని వెండితెరపై చూసే సమయం వచ్చేసింది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైఖేల్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Also Read : Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు చెరిగిన రకుల్

ఇక ఈ ట్రైలర్ కనుక చూస్తే కేవలం మైఖేల్ జాక్సన్ సాధించిన విజయాలను మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని పోరాటాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించింది. ముఖ్యంగా టీనేజ్ వయసులో తన తండ్రితో ఆయనకున్న విభేదాలు, పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న ఒత్తిడిని చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఒక సామాన్య బాలుడు గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇక ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత తమ్ముడి కొడుకు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) పోషిస్తుండటం విశేషం. ట్రైలర్‌లో జాఫర్ లుక్స్ చూస్తుంటే.. మళ్లీ మైఖేల్ జాక్సన్ తిరిగి వచ్చాడా? అనే రేంజ్‌లో ఉన్నాడు. ఆయన డ్యాన్స్ మూవ్స్, బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్.. అచ్చు గుద్దినట్లు మైఖేల్ లాగే ఉన్నాయి. ఫ్యాన్స్‌కు ఇది కచ్చితంగా ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను ఇస్తుంది.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద $1 బిలియన్ (దాదాపు రూ. 8,300 కోట్లు) మార్కును సునాయాసంగా దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంగీత ప్రియులకు, మైఖేల్ జాక్సన్ అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు.

 

Exit mobile version