Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నమెంట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే జట్లు తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడతాయని.. ఈసారి భారత్ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు. అదికూడా, భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తుందని తన జోస్యం వెల్లడించాడు.
Read Also: Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్
దుబాయ్ పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని, భారత స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నారని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేస్తాడని ఆయన అంచనా వేశారు. ఇటీవల రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చినట్లు చెబుతూ, అతని అటాకింగ్ ఆటశైలి భారత్‌కు కీలకం కానుందని క్లార్క్ విశ్లేషించాడు. ఇక, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా, మరోసారి భారత్‌ను ఢీకొననుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈసారి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో గెలుపొందుతుందని క్లార్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కాపోతే ప్రస్తుతం ట్రోని విషయానికి వస్తే.. దాదాపు సెమిఫైనల్ జట్లపై పూర్తి క్లారిటీ వచ్చింది. గ్రూప్ A నుండి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు.. మరోవైపు గ్రూప్ B నుండి భారత్, న్యూజిలాండ్ లు సెమిఫైనల్ కు అర్హత పొందాయి. ఇందులో నేడు జరిగే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచినా, ఓడినా సెమిఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఇక ఏదో అద్భుతం జరిగితే తప్పంచి దక్షిణాఫ్రికా బదులు ఆఫ్ఘానిస్తాన్ సెమిఫైనల్ లో అవకాశం లభిస్తుంది.