MG Windsor EV: గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ కంపెనీల కారుల సేల్స్ ను అధిగమిస్తూ, ఎంజీ మోటార్స్ తమ ఎంజీ కామెట్, ఎంజీ జెడ్‌ఎస్, ఇంకా విండ్సర్ ఈవీ మోడళ్లతో మార్కెట్లో తన ప్రత్యేకతను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఎంజీ విండ్సర్ ఈవీ అమ్మకాల్లో టాప్ స్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ధరల పెంపుతో కొనుగోలుదారులకు షాక్ తగిలింది. విండ్సర్ ఈవీ క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ (CUV) ధరను రూ. 50,000 వరకు పెంచినట్లు ఎంజీ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ మోడల్ దాదాపు 10,000 యూనిట్ల అమ్మకాలతో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ భారీ డిమాండ్ కారణంగా ఎంజీ సంస్థ ఈవీ కారు ధరను పెంచేసింది.
Also Read: UI Movie : “యూఐ” మూవీకి సంబంధించిన ఆ వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్
ఈ విండ్సర్ ఈవీ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రామ్ కింద ఈ కారును కేవలం రూ. 9.99 లక్షల ధరతో కొనుగోలు చేయవచ్చు. బాస్ ప్రోగ్రామ్ కింద బ్యాటరీకి ప్రతి కి.మీ. కి రూ. 3.50 అద్దె చెల్లించవలసి ఉంటుంది. బ్యాటరీ అద్దె లేకుండా ఈ కారును రూ. 13.50 లక్షల ప్రారంభ ధరతో లభించేది. తాజాగా పెంపుతో దీని ధర రూ. 14 లక్షలకు చేరుకుంది. విండ్సర్ ఈవీ ఎక్సైట్ (Excite), ఎక్స్‌క్లూజివ్ (Exclusive), ఇంకా ఎసెన్స్ (Essence) అనే మూడు వేరియంట్లలో ఈ కారు కొనుగోలుదారులకు లభిస్తుంది. ఇకపోతే, తాజా ధర పెంపుతో ధరలు అన్ని వేరియంట్లకు రూ. 50,000 వరకు పెరిగాయి. ఈ కారు టర్కోయిస్ గ్రీన్, స్టార్‌బర్ట్స్ బ్లాక్, క్లే బీజ్, మరియు పర్ల్ వైట్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో లభిస్తాయి.
Also Read: Demi Moore: మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్న 62 ఏళ్ల నటి
ఈ కారులో విండ్సర్ ఈవీ 15.6 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని కలిగిస్తోంది. ఈ కారులో లెవల్-2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. విండ్సర్ ఈవీ కారు 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌తో ఇది 330 కి.మీ. రేంజ్ అందిస్తుంది. 7.4KW ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం ఒక గంటలో 80% బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చు.