Site icon NTV Telugu

Cartier: లక్షల విలువైన బంగారు ఆభరణాలను కేవలం రూ. 2 వేలకే కొన్న కస్టమర్.. మ్యాటరేంటంటే..

Jewllery

Jewllery

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు వివిధ కంపెనీలు అమ్మకాలను పెంచుకోవడానికి అనేక ఆఫర్‌లను ప్రకటించడం మనందరికీ తెలిసిందే. పండుగ సందర్భంగా కొన్ని కంపెనీలు 50% – 80% వరకు తగ్గింపును అందిస్తాయి. కానీ మెక్సికోకు చెందిన ఒక కస్టమర్ వేల డాలర్ల విలువైన ఆర్డర్లు కేవలం కొన్ని పదుల డాల్లర్స్ కే కొంటానని కలలో కూడా ఊహించలేదు. అదే సమయంలో చిన్న పొరపాటుకు కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Also Read: AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..

మెక్సికన్‌లోని రిజిలియో విల్లారియల్, ఫ్రెంచ్ నగల కంపెనీ ‘కార్టియర్’ కోసం గత సంవత్సరం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అతను ధరలను చూస్తుండగా.. 142 వజ్రాలు ఉన్న బంగారు చెవిపోగులు కేవలం 13.85 డాలర్లు అని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆన్‌ లైన్‌ లో డబ్బు చెల్లించి రెండు జతల చెవిపోగులు ఆర్డర్ చేసాడు. అతని ఆర్డర్ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. అయితే ఈ ఆర్డర్‌తో కంపెనీ షాక్‌కు గురైంది. వెబ్‌సైట్‌లో అసలు ధరను నమోదు చేసినప్పుడు అక్షర దోషము వల్ల అలా జరిగిందని పేర్కొంది.

Also Read: Whats up: వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేస్తే అకౌంట్ బ్లాక్

ఇక విషయాన్ని కస్టమర్ కు తెలిపామని.. ఈ జంట కమ్మలు అసలు ధర 14,000 డాలర్లని తెలిపింది. ఒక లోపం కారణంగా వారు నా రెండు జతల కమ్మల ఆర్డర్‌ను రద్దు చేసారు. బదులుగా నాకు ఓ కన్సులేషన్ బహుమతిని అంధిస్తారని తెలిపారు. కానీ లిగేరియో ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. తాను ఆర్డర్ చేసిన రెండు జతల కమ్మలని అందచేయాలనీ పట్టుబట్టాడు. అతను మెక్సికన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశాడు. నెలల తరబడి వాదన తర్వాత, కార్టియర్ సంస్థ వెనక్కి తగ్గి, అతని ఆర్డర్ ను తాజాగా డెలివర్ చేసింది. ఇందుకు సంబంధించి చెవి కమ్మల అందమైన ప్యాకింగ్ ఫొటోలను రిజిలియో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇందులో తన తల్లికి ఒక జత చెవి కమ్మలను ఇచ్చానని.. మరో జతను తన వద్దే ఉంచుకున్నట్లు తెలిపాడు.

Exit mobile version