NTV Telugu Site icon

Mindspace to Shamshabad Metro: హైటెక్ నగరం రూపు మార్చనున్న మరో మెట్రో

Hyderabad Metro 1 649x432 (1)

Hyderabad Metro 1 649x432 (1)

హైదరాబాద్ పేరు చెబితే ఒకప్పుడు చార్మినార్, బిర్లామందిర్,గోల్కొండ వినిపించేవి. ఇప్పుడేమో హైటెక్ సిటీ, హైదరాబాద్ మెట్రో, అంతర్జాతీయ కంపెనీల మాటలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగర వాసులకు అందమైన, అద్భుతమయిన, ఆహ్లాదకరమయిన అనుభూతిని అందిస్తోంది హైదరాబాద్ మెట్రో. ఇప్పుడు మరో దశ మెట్రోకు బీజం పడింది. హైదరాబాద్ హైటెక్ సిటీకి తలమానికంగా భావించే మైండ్ స్పేస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ హాయిగా మెట్రలో ఏసీలో హాయిగా సేదతీరుతూ ప్రయాణం చేసే రోజు రాబోతోంది.

మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోకారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా డిసెంబర్ 9 న సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. రానున్న మూడు సంవత్సరాలల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్నదని సిఎం తెలిపారు. ఈ మెట్రో.. వయా, బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్ రామ్ గూడ జంక్షన్ ను తాకుతూ వెలుతుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా ( right of way) మెట్రో రైలు నడుస్తుంది. మొత్తం 31 కిలో మీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టు ను రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి.

Read Also:Kishan Reddy: భిన్నకళలు, సంస్కృతిని కాపాడుకుందాం

విశ్వ నగరంగా మారిన హైదరాబాద్ నగర భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చిదిద్దుతూ, నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో చేరుకునేలా మెట్రో ప్రాజెక్టు (air port express high way) ని రూపకల్పన చేయడం జరిగింది. ప్రపంచంలోని ప్రముఖ మెట్రో నగరాలన్నింటిలోనూ కూడా ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో వుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న కెసిఆర్ దార్శనికత నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణలతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం జరిగింది.

ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మెట్రోను విమానాశ్రయం వరకు అనుసంధానించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. మెట్రో ప్రాజెక్ట్ వలన మరిన్ని పెట్టుబడులకు హైదరాబాద్ గమ్య స్థానం గా మారబోతుంది. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీని తట్టుకునే ఉద్దేశంతో, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశంతో మంత్రి కెటిఆర్ కృషితో పెద్ద ఎత్తున రవాణా మౌలిక వసతులను కల్పిస్తుంది. అనేక ప్రాజెక్టులను, ఫ్లై ఓవర్లను, లింక్ రోడ్లను, ఇతర రహదారి వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మరింతగా ముందుకు దూసుకుపోనుంది.

Read Also:CM KCR: సృజనాత్మకంగా ఆలోచిస్తేనే ప్రజల ఆదరణ