NTV Telugu Site icon

Rain Alert: సెప్టెంబర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ..

Rain Alert

Rain Alert

దేశంలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ(IMD) కొత్త నివేదికను విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. అక్కడ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టులో భారతదేశంలో సగటు కంటే 16 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2001 నుండి ఇంత వర్షపాతం నమోదు కావడం ఇది ఐదవసారి. అయితే.. ఆగస్టు నెలలో 287 మిల్లీమీటర్ల మంచి వర్షపాతం కూడా వేడిని చల్లార్చలేకపోయింది. ఆగస్టు నెలలో కనిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంది.

Read Also: Hyderabad-Vijayawada highway Closed: హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్..

ఇదిలా ఉంటే.. ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ కూడా జారీ అయింది. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. ఈ క్రమంలో.. కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణా, రాయలసీమ, కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, దక్షిణ విదర్భ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read Also: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?

Show comments