Site icon NTV Telugu

Merry Christmas : ఓటీటీలోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 01 24 At 11.14.07 Am

Whatsapp Image 2024 01 24 At 11.14.07 Am

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాలీవుడ్‌ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. అయితే కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా మెర్రీ క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అరవై కోట్లకు ఓటీటీ రైట్స్‌ను కొనుగులు చేసింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.ఈ ఒప్పందం మేరకు ఫిబ్రవరి 9 లేదా పదహారు నుంచి మెర్రీ క్రిస్మస్‌ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని తెరకెక్కించాడు. అంధాదూన్ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత అతడు దర్శకత్వం వహించిన మూవీ ఇదే కావడం విశేషం.. ఫ్రెంచ్ నవల బర్డ్ ఇన్ ఏ కేజ్ ఆధారంగా మెర్రీ క్రిస్మస్‌ను మూవీని తెరకెక్కించారు. సింపుల్ పాయింట్ అయినా శ్రీరామ్ రాఘవన్ టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయి. శ్రీరామ్ రాఘవన్ కెరీర్‌లో అత్యధిక ఐఎమ్‌డీబీ ర్యాంక్‌ను దక్కించుకున్న మూవీగా మెర్రీ క్రిస్మస్ నిలిచింది.మెర్రీ క్రిస్మస్ మూవీ దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సంక్రాంతికి భారీ పోటీ కారణంగా బాలీవుడ్ మినహా తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. 12 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 17 కోట్లకుపైగా వసూళ్లను సాధించి నష్టాల దిశగా సాగుతోంది. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ 20 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్‌ ను రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version