Merry Christmas : ఓటీటీలోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. అయితే కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా మెర్రీ క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అరవై కోట్లకు ఓటీటీ రైట్స్‌ను కొనుగులు చేసింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.ఈ ఒప్పందం మేరకు ఫిబ్రవరి 9 లేదా పదహారు నుంచి మెర్రీ క్రిస్మస్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని తెరకెక్కించాడు. అంధాదూన్ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత అతడు దర్శకత్వం వహించిన మూవీ ఇదే కావడం విశేషం.. ఫ్రెంచ్ నవల బర్డ్ ఇన్ ఏ కేజ్ ఆధారంగా మెర్రీ క్రిస్మస్‌ను మూవీని తెరకెక్కించారు. సింపుల్ పాయింట్ అయినా శ్రీరామ్ రాఘవన్ టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయి. శ్రీరామ్ రాఘవన్ కెరీర్‌లో అత్యధిక ఐఎమ్‌డీబీ ర్యాంక్‌ను దక్కించుకున్న మూవీగా మెర్రీ క్రిస్మస్ నిలిచింది.మెర్రీ క్రిస్మస్ మూవీ దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సంక్రాంతికి భారీ పోటీ కారణంగా బాలీవుడ్ మినహా తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. 12 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 17 కోట్లకుపైగా వసూళ్లను సాధించి నష్టాల దిశగా సాగుతోంది. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ 20 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!