Memantha Siddham: ఏపీలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తుండటంతో ప్రచారంలో సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర చేస్తున్నారు. కాగా, ఇవాళ ఉగాది పండగ కావడంతో యాత్రకు బ్రేక్ ఇచ్చాడు. దీంతో మేమంతా సిద్ధం 12వ రోజు రేపటి (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. ఈ యాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ( బుధవారం ) ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని సీఎం జగన్ మధ్యా్హ్న భోజన విరామం తీసుకోనున్నారు.
Read Also: SRH vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..!
ఇక, ఆ తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా రేపు ( బుధవారం ) మధ్యాహ్నం 3. 30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. సభ తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి చేరుకోనున్నారు.