NTV Telugu Site icon

Memantha Siddam Bus Yatra: శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!

15

15

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ‘మేమంతా సిద్ధం ‘ అంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా సందర్శిస్తూ అక్కడ ఏర్పాటుచేసిన సమావేశాల్లో ప్రసంగిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు.

Also read: Teja Sajja: హను-మాన్ తరువాత తేజ సజ్జా సినిమా ఇదే.. రేపే అధికారిక ప్రకటన!

ఇకపోతే ఏప్రిల్ 13 శనివారం నాడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు నంబూరు బైపాస్ రాత్రి బస నుంచి బయలుదేరుతారు. ఇక అక్కడి నుండి కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు CK కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్.

Also read: Praja Shanti Party: ప్రజాశాంతి పార్టీకి గుర్తు కేటాయింపు.. ఏంటో తెలుసా..!

ఆ కార్యక్రమం తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్ కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. భోజనం అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇలా శనివారం మ్మొత్తం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసుతుంది.

Show comments