NTV Telugu Site icon

Mehreen Pirzada: నకిలీ వార్తలను రాయడం మానుకోండి.. మీడియాపై మెహ్రీన్ ఫైర్!

Mehreen Pirzada

Mehreen Pirzada

Mehreen Pirzada lashed out at the media over Egg Freezing: తాను ఎగ్ ఫ్రీజింగ్ (అండాల శీతలీకరణ) చేయించుకున్నట్లు టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఇటీవల తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, ఎగ్ ఫ్రీజింగ్‌పై అవగాహన కల్పించడానికే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్.. మెహ్రీన్‌పై నెగిటివ్ కామెంట్స్ రాసుకొచ్చాయి. పెళ్లి కాకుండానే మెహ్రీన్ తల్లి అయ్యారంటూ పలు కథనాలు రాశాయి. ఈ కథనాలపై ఆమె స్పందించారు. నకిలీ వార్తలను రాయడం మానుకోండని మీడియాపై ఫైర్ అయ్యారు.

మెహ్రీన్ పిర్జాదా తన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రియమైన మీడియా.. కొంతమంది రిపోర్టర్లు తమ ఉద్యోగాన్ని గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజం పట్ల తాము ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాయో అర్థం చేసుకోవాలి. నకిలీ, తప్పుడు సమాచారంతో వార్తలను విక్రయించడం అనైతికమే కాదు.. చట్టవిరుద్ధం కూడా. ఎగ్ ఫ్రీజింగ్ కోసం ఓ అమ్మాయి గర్భవతి కానవసరం లేదు. నేను చేసిన పోస్ట్.. నా లాంటి వ్యక్తులకు అవగాహన కల్పించడం కోసమే. సామాజిక అవగాహన కోసం నా వ్యక్తిగత విషయాన్ని పంచుకోవడానికి నేను చాలా ధైర్యం చేశాను’ అని మెహ్రీన్ పేర్కొన్నారు.

Also Read: KL Rahul: ఈ సీజన్‌లో మాకు అతిపెద్ద సమస్య అదే: కేఎల్ రాహుల్

‘ఓ సెలబ్రిటీగా నా లక్ష్యం ఏమిటంటే.. పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లిదండ్రులు, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకునే అమ్మాయిలు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోండి. లేకపోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నా అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు అండగా నిలిచారు. అధునాతన వైద్య శాస్త్రాన్ని కలిగి ఉన్నందుకు మన వైద్యులు, మన దేశం పట్ల మనం గర్వపడాలి. చాలా మంది ఉత్తమ ఫలితాల కోసం విదేశాల నుండి భారతదేశానికి వస్తున్నారు. సమాజంలో బాధ్యత గల రిపోర్టర్లు ఇలా దిగజారడం బాధాకరం. నాపై తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, వార్తలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నా’ అని మెహ్రీన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Show comments