Site icon NTV Telugu

Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం

Meghalaya Political Crisis

Meghalaya Political Crisis

Meghalaya Political Crisis: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో రాజకీయ గందరగోళం నెలకొంది. మంగళవారం ఒక్కరోజులో 12 మంది మంత్రులలో ఎనిమిది మంది అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు. ప్రస్తుతం మేఘాలయలో ఎన్‌పిపి నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే రాజీనామా చేసిన మంత్రులు సీఎం కాన్రాడ్ కె సంగ్మా సమక్షంలో వారి రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు. ఇంతకీ ఈ రాజీనామాలకు కారణం ఏంటి..

READ ALSO: Vijayawada Utsav: ‘విజయవాడ ఉత్సవ్‌’కు హైకోర్టు షాక్‌..!

మంత్రివర్గంలోకి కొత్తవారికి ఛాన్స్..
ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన మంత్రివర్గంలో కొంతమంది కొత్త నాయకులను చేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుత మంత్రులను రాజీనామా చేయమని కోరినట్లు సమాచారం. రాజీనామా చేసిన ఎనిమిది మంది మంత్రులలో NPPకి చెందిన అంపారీన్ లింగ్డో, కమెగోన్ యంబోన్, రక్కం ఎ సంగ్మా, అబు తాహిర్ మండల్, UDPకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, HSPDPకి చెందిన షక్లియార్ వార్జ్రీ, BJPకి చెందిన AL హెక్ ఉన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారంలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 12 మందికిపైగా మంత్రులు ఉండకూడదు. తాజాగా రాజీనామా చేసిన వారు ఆయా పార్టీల సంస్థాగత పనుల్లో నిమగ్నం కానున్నట్లు సమాచారం. మంత్రివర్గంలోకి కొత్తగా రానున్న సభ్యులతో మంగళవారం సాయంత్రం రాజ్ భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక అధికారి తెలిపారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణాలు..
మేఘాలయలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వెనుక అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకోవడానికి, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరచడానికి, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని సమాచారం. అలాగే కొత్త ముఖాలను చేర్చడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలో భాగంగా దీనిని చెబుతున్నారు.

READ ALSO: London Protests 2025: లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా! అసలు బ్రిటన్‌లో ఏం జరుగుతుంది..

Exit mobile version