Site icon NTV Telugu

Chiranjeevi : ‘మా తాత రసికుడు.. నాకు ఇద్దరు అమ్మమ్మలు’.. వైరల్ అవుతున్న మెగాస్టార్ కామెంట్స్

New Project (68)

New Project (68)

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో, ప్రైవేట్ లైఫ్‌లో ఎంత హాస్యభరితంగా ఉంటారో అందరికి తెలిసిన విషయం. ‘చంటబ్బాయి’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’, ‘జై చిరంజీవా’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఇక రియల్ లైఫ్‌లో కూడా చిరంజీవి ఎంత పంచ్ లైన్స్‌ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారో తెలిసిన విషయమే.

Read Also:Liquor Home Delivery: ఏలూరులో లిక్కర్‌ డోర్‌ డెలివరీ.. వీడియోలు వైరల్..

తాజాగా చిరంజీవి హాస్యంతో మరోసారి అందరినీ నవ్వించారు. హైదరాబాద్‌లో బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఫంక్షన్‌లో యాంకర్ సుమ, చిరంజీవి తాత గురించి మాట్లాడాలని కోరినప్పుడు, చిరంజీవి తన స్మృతులను హాస్యంగా పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “మా అమ్మ తరచూ చెప్పేది.. ‘నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ, మీ తాత బుద్ధులు రాకూడదు’ అని. ఎందుకంటే తాత మాత రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు” అని ఫన్నీగా చెప్పారు.

Read Also:Niloufer Hospital: నీలోఫర్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. 27 వారాల గర్భవతిని కాపాడిన డాక్టర్లు!

ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు చిరంజీవి కామెడీ టైమింగ్‌ను మెచ్చుకుంటూ “బాస్ రూటే సపరేటు, బాస్ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం ఎవరి వల్లా కాదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి సరదా కామెంట్స్, ఆయన ప్రత్యేకమైన హాస్యభరితమైన వ్యాఖ్యలు ఆ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి.

Exit mobile version