Megastar – Super star : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చనడుస్తోంది. రెండు సినీ దిగ్గజాలు బాక్స్ ఆఫీసుపై పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఎన్ని రికార్డులు నెలకొల్పుతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారెవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్.. కోలీవుడ్ సూపర్ స్టార్. వీరిద్దరూ నటిస్తున్న సినిమాలు ఒకరోజు తేడాతో విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలను మేకర్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించి భోళా శంకర్ ఆగష్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా శరవేగంగా విడుదలకు సిద్ధమవుతోంది. తమన్నా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలుగా చేస్తోంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటెర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈమూవీ తమిళ మూవీ వేదాళం కి రీమేక్ గా తెరకెక్కుతోంది.
Read Also:Muscle Cramps: మీరు నడుస్తుంటే కండరాల్లో నొప్పి వస్తుందా..?
ఇక సూపర్ స్టార్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు. ఆయనకు జోడీగా ఈ సినిమాలోనూ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న జైలర్ కి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీని ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక చిన్న గ్లింప్స్ ద్వారా మేకర్స్ అఫీషయల్ గా అనౌన్స్ చేసారు. దీనితో ఇటు మెగాస్టార్ భోళా శంకర్, అటు రజినీకాంత్ జైలర్ సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఫిక్స్ అయింది. కాగా ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల బాక్సాఫీస్ క్లాష్ వారి వారి అభిమానులు, ప్రేక్షకుల మధ్య ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తోంది. మరి వీటిలో ఏ సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక జైలర్ తెలుగులో కూడా భారీగానే రిలీజ్ కానుంది.
Read Also:Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్.. తలసాని కీలక వ్యాఖ్యలు
