Site icon NTV Telugu

Mega Star : విశ్వంభర డబుల్ షాక్.. 400 కోట్లా?

Vishwambhara

Vishwambhara

అప్పుడెప్పుడో మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను ఇంకా చెక్కుతునే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రిలీజైపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇంకా విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. నిజానికి, గతేడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది. కానీ, విఎఫ్‌ఎక్స్ కారణంగా వాయిదా పడుతు వస్తోంది. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం గట్టిగా వర్క్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ పట్ల చిత్ర యూనిట్‌తో పాటు.. మెగాస్టార్ కూడా సంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం.

అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. ఈ ఏడాది జూన్ లేదా జులైలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా మొదటి నుంచి ప్రచారంలో ఉంది. బడ్జెట్ 200 నుంచి 250 కోట్ల వరకు ఉంటుందనే టాక్ ఉంది. కానీ, ఇప్పుడు ఇది డబుల్ అయినట్టుగా తెలిసింది. ఏకంగా 400 కోట్లు అని.. సినిమాటోగ్రాఫర్ చోటా కే. నాయుడు చెప్పడం విశేషం. విశ్వంభర గురించి ఓ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. విశ్వంభర’ కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నాము. ఎందుకంటే, ‘విశ్వంభర’లో చాలా సీజీ వర్క్ ఉంది. అక్కడ నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు! సీజీ వర్క్ బాగుండాలి. ఎందుకంటే, ఆ మూవీ వెనక రూ.400 కోట్లు ఉంది. అందుకే చాలా టైమ్ తీసుకుంటున్నాం. ఇది ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. విశ్వంభర బడ్జెట్ డబుల్ అయిందనే చెప్పాలి.

Exit mobile version