CP Sajjanar: ఐ బొమ్మ రవి దగ్గర 50 లక్షల మంది డేటా.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Sajjanar: ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు.. సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌తో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు.. ఐ-బొమ్మ అంశంపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మక్కాకు వెళ్లిన బస్సు దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల విభాగం సైతం ఈ ఘటనపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ రోజు టాలీవుడ్‌కు చెందిన చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ కి వేల కోట్ల నష్టం వాటిల్లింది.. దేశ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇదన్నారు. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించామని గుర్తు చేశారు.. ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు పట్టుకున్నామన్నారు. మొత్తం 5 కేసులు నమోదు చేశాం.. దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని ఇదివరకే అరెస్ట్ చేశాం.. పైరసీ ముసుగులోనే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారన్నారు.
READ MORE: MP Putta Mahesh: వైసీపీ పాలనలో ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు భరోసా వచ్చింది..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు తెలిపారు. “బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన వేల సినిమాలు పైరసీ చేశాడు ఇమ్మడి రవి.. రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నాం.. 20 కోట్ల వరకు సంపాదించాను అని చెప్తున్నాడు. 50 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ డేటా ఇమ్మడి రవి వద్ద ఉంది.. ఈ డేటా ను కూడా మిస్ యూస్ చేసే అవకాశం ఉండేది.. దీని వెనక పెద్ద రాకెట్ ఉంది.. మీ డేటా డార్క్ వెబ్ కి చేరే అవకాశం కూడా ఉంది.. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది పేరెంట్స్ కి కడుపుకోత మిగిలింది.. మహారాష్ట్ర లో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు.. పాన్ కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతో ఉంది.. ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. కరేబియన్ ఐల్యాండ్ సిటిజన్ షిప్ కూడా తీసుకున్నాడు.. ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు.. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లను పెట్టాడు..” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!