Site icon NTV Telugu

CP Sajjanar: ఐ బొమ్మ రవి దగ్గర 50 లక్షల మంది డేటా.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ..

Sajjanar

Sajjanar

CP Sajjanar: ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు.. సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌తో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు.. ఐ-బొమ్మ అంశంపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మక్కాకు వెళ్లిన బస్సు దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల విభాగం సైతం ఈ ఘటనపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ రోజు టాలీవుడ్‌కు చెందిన చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ కి వేల కోట్ల నష్టం వాటిల్లింది.. దేశ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇదన్నారు. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించామని గుర్తు చేశారు.. ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు పట్టుకున్నామన్నారు. మొత్తం 5 కేసులు నమోదు చేశాం.. దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని ఇదివరకే అరెస్ట్ చేశాం.. పైరసీ ముసుగులోనే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారన్నారు.

READ MORE: MP Putta Mahesh: వైసీపీ పాలనలో ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు భరోసా వచ్చింది..

ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు తెలిపారు. “బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన వేల సినిమాలు పైరసీ చేశాడు ఇమ్మడి రవి.. రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నాం.. 20 కోట్ల వరకు సంపాదించాను అని చెప్తున్నాడు. 50 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ డేటా ఇమ్మడి రవి వద్ద ఉంది.. ఈ డేటా ను కూడా మిస్ యూస్ చేసే అవకాశం ఉండేది.. దీని వెనక పెద్ద రాకెట్ ఉంది.. మీ డేటా డార్క్ వెబ్ కి చేరే అవకాశం కూడా ఉంది.. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది పేరెంట్స్ కి కడుపుకోత మిగిలింది.. మహారాష్ట్ర లో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు.. పాన్ కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతో ఉంది.. ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. కరేబియన్ ఐల్యాండ్ సిటిజన్ షిప్ కూడా తీసుకున్నాడు.. ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు.. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లను పెట్టాడు..” అని వెల్లడించారు.

Exit mobile version