Chiranjeevi: కుర్ర హీరోలే కుళ్లుకునేలా.. ఆ క్యూట్ నెస్ ఏంటి మాస్టారూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. టాలీవుడ్‌లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ రేంజ్ వేరే లెవల్. ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోగా టాలీవుడ్ ను ఏలేస్తున్నారు. మధ్యలో పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో బిజీగా తన అభిమానులను అలరిస్తున్నారు. మెగాస్టార్ సినిమాలను భారీ ఓపెనింగ్స్, కటౌట్స్ మామూలుగా ఉండవు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు 5సినిమాలు తీశారు. వాటిలో రెండు రూ.200కోట్ల సినిమాలు కాగా మూడు డిజాస్టర్లుగా నిలిచాయి. వాటిలో తాజాగా వచ్చిన భోళాశంకర్ సినిమా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్. తమిళ్తో పోల్చుకుంటే చాలా మార్పులు చేశారు కానీ సినిమా సక్సెస్ అందుకోలేదు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్, చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా ఫ్లాప్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా వచ్చే సినిమా అయినా సాలిడ్ హిట్ కొట్టేలా ప్లాన్ చేయి మాస్టారు అంటున్నారు.
Read Also:Anushka: శెట్టి-పొలిశెట్టి వస్తున్నారు నవ్వడానికి రెడీగా ఉండండి…
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఈ క్రమంలోనే చిరంజీవి నెక్ట్స్ సినిమా గురించి పట్టుదలతో ఉన్నారని ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. చిరంజీవి తన తదుపరి సినిమా మురగదాస్ దర్శకత్వంలో చేయాలనీ భావిస్తున్నారట. రజినీకాంత్, కమల్ హాసన్ తరహాలోనే ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే తరహా యాక్షన్ ఎంటర్టైనర్ తో సినిమా చేసి కంబ్యాక్ కావాలని చూస్తున్నారట. ఈ మేరకే తాజాగా చిరంజీవికి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో చిరంజీవికి 60+అనేలా లేరు. యంగ్ హీరోల కంటే కూడా చిన్న వాడిలా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు వారెవ్వా బాసూ.. పిచ్చ క్యూట్ గా ఉన్నావంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే కుర్రహీరోలంతా కుళ్లుకునేలా ఉన్నారంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం మురగదాస్ శివకార్తికేయన్ తో సినిమా చేస్తున్నాడు. అది అయిన తర్వాత మెగాస్టార్ , మురుగదాస్ కాంబో మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా చిరంజీవి లుక్ మాత్రం కెవ్వుకేక.
Read Also:Fire Accident : రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!