Chiranjeevi: అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
- అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్
- చిరంజీవి పుట్టినరోజున తిరుమలకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లిన అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యాన్స్ ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా చిరంజీవి పుట్టిన రోజున ఓ అభిమాని పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లిన విషయం విదితమే. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈశ్వరయ్య అనే అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలియగానే చిరంజీవి, ఈశ్వరయ్య, ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారికి కుటుంబానికి పట్టు బట్టలు పెట్టి సత్కరించటం విశేషం. ఈ సందర్భంగా ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు.
Read Also: Thangalan: రూ.100 కోట్ల చేరువలో చియాన్ విక్రమ్ ‘తంగలాన్’
Also Read
సోమవారం రోజున చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు. ప్రతీ ఏడాది అయ్యప్ప మాలను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాలను ధరించారు. మాలధారణలోనూ ఈశ్వరయ్య కుటుంబంతో చిరంజీవి కలిసి మాట్లాడారు. సాధారణంగా చిరంజీవి తన హార్డ్ కోర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలుస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిరూపణ అయ్యింది. ఇప్పుడు ఈశ్వరయ్య గురించి తెలియగానే మరోసారి మెగాస్టార్ ఆయన్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు, జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయటం విశేషం. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య చిన్నప్పటి నుంచి చిరంజీవికి వీరాభిమాని అని తెలుస్తోంది. గత 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ అభిమాని పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!