Megastar Chiranjeevi godfather movie teaser his birthday
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వచ్చిందటే చాలు మెగా అభిమానులు పండుగ చేసుకుంటారు. చిరంజీవిని ఎంతగానే ఇష్టపడే అభిమానుల ఆయన బర్త్‌డే రోజు వివిధ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే.. ఇప్పటికే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్ల కొందరు అభిమానులు ప్రకటించగా.. మరి కొందరు ఇంకొన్ని సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. అయితే.. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఈ సినిమానే కాకుండా చిరంజీవి మరి కొన్ని సినిమాలు సైతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ నెల 22న చిరంజీవి బర్త్‌డే ను పురస్కరించుకొని మెగా అభిమానులకు గాడ్‌ఫాదర్ మేకర్స్ మాంచి ట్రీట్ ఇవ్వనున్నారు.
చిరంజీవి పుట్టినరోజుకు ముందే.. ఈ నెల21న గాడ్ ఫాదర్ నుంచి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. అయితే.. గాడ్ ఫాదర్ మూవీ.. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రామచరణ్ నటించిన ‘ధృవ’ సినిమా దర్శకుడు మోహన్ రాజానే ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఈసినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా.. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య వచ్చి సన్నివేశాలు పవర్‌ఫుల్‌గా ఉంటాయట. ఈ చిత్రంలో అందాల తార నయనతార మెగాస్టార్‌కు సోదరిగా నటిస్తున్నారు.
