Chiranjeevi : 48 ఏళ్ల మెగా ప్రస్థానం.. ‘పునాదిరాళ్లు’ జ్ఞాపకాల్లో ఎమోషనల్ అయిన చిరంజీవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా గమనాన్ని మార్చేసిన ఒకే ఒక్క పేరు.. ‘మెగాస్టార్’ చిరంజీవి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా, కేవలం కృషితో బాక్సాఫీస్ రారాజుగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక మహా కావ్యం. నటనలో ఒడిదుడుకులు, డ్యాన్స్‌లో కొత్త ఒరవడి, ఫైట్స్‌లో గ్రేస్.. ఇలా అన్నీ కలగలిసిన ఆ శిఖరం వెండితెరపై మొదటి అడుగు వేసి నేటికి సరిగ్గా 48 ఏళ్లు పూర్తయింది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని, తన సినీ జీవితానికి తొలి ‘పునాది’ పడిన రోజును గుర్తు చేసుకుంటూ చిరంజీవి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read : NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ టీజర్‌తో టైటిల్.. టీజర్ డేట్ ఫిక్స్?
Also Read
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
చందమామ కథ లాంటి ఆ తొలి అడుగు.. 1978 ఫిబ్రవరి 11న ‘పునాదిరాళ్లు’ సినిమా కోసం చిరంజీవి తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఆ రోజు అనుభూతిని నెమరువేసుకుంటూ.. “ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత మాటల్లో వర్ణించలేనివి. ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది.. అదొక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి” అని ఆయన రాసుకొచ్చారు. తనపై నమ్మకం ఉంచి మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడు గుడపాటి రాజకుమార్, నిర్మాత క్రాంతి కుమార్ కి ఆయన శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా, తనను ఇంట్లో మనిషిలా ఆదరిస్తున్న ప్రేక్షకులే తన ఈ విజయానికి అసలైన పునాది అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ‘పునాదిరాళ్లు’ సినిమానే ఆయన కెరీర్‌కు నిజమైన పునాదిగా నిలిచిందని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?