Site icon NTV Telugu

MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

Mega 158

Mega 158

‘వాల్తేరు వీరయ్య’ వంటి  హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి  మరోసారి జతకడుతున్నారు. మెగా 158గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి మరియు రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైంది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మెగా 158’ చిత్రాన్ని ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయబోతున్నారు.

Also Read : Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ.. ట్రాక్ తప్పాడా?

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మరియు స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాయి. బాబీ ఈసారి మెగాస్టార్‌ను మరింత పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ రోల్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 20 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ప్రియమణి నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బాబీ ఈసారి కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేలా కథను సిద్ధం చేశారు. 2027 సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version