NTV Telugu Site icon

Job Mela In Vijayawada: విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా

Job Mela

Job Mela

Job Mela In Vijayawada: విజయవాడ నగరంలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, మన అదృష్టం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారన్నారు. ఆయనకు ఉన్న విజన్ 2020ను ఎవరూ నమ్మలేదు, కానీ.. అదే విజన్ ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్తుంది. హైదరాబాద్, అమరావతి నగరాలను నిర్మించిన ఘనత చంద్రబాబుదే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మాత్రమే కాకుండా, పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. జనవరి 5న MSME అవగాహన సదస్సు నిర్వహించి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహించడానికి కృషి చేస్తాం అని ఆయన అన్నారు.

Also Read: Nitish Kumar Reddy: తగ్గేదేలే.. ఆస్ట్రేలియాలో మొదటి సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి

ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. నాయకుడు చంద్రబాబు యువత అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారని, ఈ మెగా వికసిత్ జాబ్ మేళా అదే ఆలోచనలో భాగం అని అన్నారు. మన నియోజకవర్గంలో ప్రతి యువతికి ఉద్యోగం కల్పించడమే మా లక్ష్యం అని, ఈ జాబ్ మేళా యువతకు మంచి అవకాశం అన్నారు. అలాగే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. యువత కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించడం గతంలో ఎక్కడా చూడలేదు. ఇది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిబద్ధతను చాటిచెప్పింది. గతంలో మన రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలను తీసుకువచ్చిన చంద్రబాబు కృషి అద్భుతం అని అన్నారు. ఈ రోజు 3,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ మేళా ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Tirumala Parakamani: తిరుమల పరకామణి సొమ్ముల స్వాహాపై పూర్తి విచారణ జరపాలన్న బీజేపీ నేతలు

ఇక ఈ మెగా వికసిత్ జాబ్ మేళాకు యువత నుండి విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు 2,000 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, 3,000 మంది ఆఫ్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. యువతకు మరింత ఉపయుక్తమయ్యేలా ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమం యువతకు కొత్త అవకాశాలను అందించడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.

Show comments