Site icon NTV Telugu

UP: బయట కంప్యూటర్ సెంటర్.. లోపల సె*క్స్ రాకెట్.. బిత్తరపోయిన పోలీసులు..!

Up

Up

UP: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు కంప్యూటర్ సెంటర్ ముసుగులో నడుస్తున్న ఒక స్పా సెంటర్‌ను ఛేదించారు. ఇక్కడ వ్యభిచారం(సె*క్స్ రాకెట్) జరుగుతోందని ఆరోపణలూ ఉన్నాయి. ఈ దాడిలో తొమ్మిది మంది యువతులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు కస్టమర్లు, ఒక స్పా ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నౌచండి పోలీస్ స్టేషన్ ప్రాంతం నయా సడక్ ఘర్ రోడ్‌లోని ఒక కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

READ MORE: India’s Big Sports Day: క్రికెట్‌లో పాక్‌.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్‌కు డబుల్ ‘పరీక్ష’..!

నిందితులు కంప్యూటర్ సెంటర్ లాగా జనాలను నమ్మించారు. వెలుపల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల చిత్రాలను ఉంచారు. దానిపై “కంప్యూటర్‌ను ఆపరేటింగ్ నేర్చుకోండి. జాబ్ వర్క్ నేర్చుకోండి” అని ఓ బోర్డును ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు లోపలికి వెళ్లగా.. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు విభిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితిని చూసి పోలీసులు సైతం బిత్తరపోయారు. సివిల్ లైన్ సీఓ అభిషేక్ తివారీ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దాడిలో కంప్యూటర్ సెంటర్ ముసుగులో పనిచేస్తున్న స్పా సెంటర్‌ను పోలీసులు కనుగొన్నారు. అంతే కాదు.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ సెంటర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులు చాలా కాలంగా వస్తున్నాయని సీఓ అభిషేక్ తివారీ తెలిపారు. ఫిర్యాదులను నిర్ధారించిన తర్వాత దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. దర్యాప్తులో, కంప్యూటర్ సెంటర్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారనేది నిజమేనని తేలిందని.. అదుపులోకి తీసుకున్న వారందరినీ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.

Exit mobile version