UP: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు కంప్యూటర్ సెంటర్ ముసుగులో నడుస్తున్న ఒక స్పా సెంటర్‌ను ఛేదించారు. ఇక్కడ వ్యభిచారం(సె*క్స్ రాకెట్) జరుగుతోందని ఆరోపణలూ ఉన్నాయి. ఈ దాడిలో తొమ్మిది మంది యువతులను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు కస్టమర్లు, ఒక స్పా ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నౌచండి పోలీస్ స్టేషన్ ప్రాంతం నయా సడక్ ఘర్ రోడ్‌లోని ఒక కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.