అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చి కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రజలు అల్లాడిపోతే వారి గురించి కేటీఆర్ మాట్లాడరని, రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదన్నారు. అమెరికా నుంచి రాగానే ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తాడని అనుకున్నామని, సూర్యాపేట, మహబూబాబాద్ రైతులను కలుస్తడని భావించామన్నారు. కౌశిక్ రెడ్డి అనే శాడిస్ట్, సైకో, పిచ్చి కుక్క లా స్వైర విహారం చేస్తున్న వ్యక్తి ఇంటికి కేటీఆర్ పోయారని ఆయన అన్నారు. వీళ్ల కు తెలంగాణ జనం పైన ప్రేమ ఉందా..? బాధితుల మీద కనీసం సానుభూతి ఉందా అని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప మరోకటి లేదన్నారు మేడిపల్లి సత్యం.
Comedian Satya : భలే దొరికావయ్యా.. సత్యా!
అంతేకాకుండా..’ఎప్పుడూ రేవంత్ రెడ్డి కుర్చీ పైనే కేసీఆర్, కేటీఆర్ ఆలోచన అంతా… మా సీఎం కాళ్లలో కట్టె పెట్టి శునకానందం పొందడమే అయ్యా , కొడుకుల లక్ష్యం.. తెలంగాణలో అశాంతి సృష్టించాలన్నదే వీరి ప్రధాన ఉద్దేశం … తెలంగాణలో బీఆర్ఎస్ నేతల అరాచకాలను సాగనివ్వం… అనవసర మాటలు మాట్లాడితే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా చూస్తూ ఉరుకోం.. మా సీఎం రేవంత్ రెడ్డి పైన ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఒక్కొక్కరి తాట తీస్తాం… కేటీఆర్ ఒళ్ళు దగ్గరపెట్టుకొ… పిచ్చి పిచ్చి గా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతరు… తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులే.. తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ రెచ్చగొట్టాల్సిన అవసరం మా సీఎం కు లేదు’ అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు.
Breaking News: సీఎం మమతాను కలిసిన ట్రైనీ డాక్టర్‌లు.. 5 డిమాండ్లు ఇవే..