NTV Telugu Site icon

Kurnool Crime: కర్నూల్‌లో మెడికో ఆత్మహత్య..

Jangaon Crime

Jangaon Crime

Kurnool Crime: విద్యా సంస్థల్లో కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలో తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. వైద్యవృత్తి లక్ష్యంగా.. ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతోంది.. తాజాగా, కర్నూలులో మరో మెడికో ప్రాణాలు తీసుకున్నాడు.. విశ్వభారతి మెడికల్ కాలేజీలో లోకేష్ అనే మెడికో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న లోకేష్ స్వస్థలం.. నెల్లూరు జిల్లా కావలిగా చెబుతున్నారు.. ఇక, లోకేష్‌ ఆత్మహత్య చేసుకున్న విషయంపై తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం ఇచ్చారు పోలీసులు.. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు పోలీసులు.. ఆత్మహత్యకు చదువులో ఒత్తిడా..? లేకా ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. ఈ రెండు కాకుండా మరేదైనా కారణం ఉందా? అనే వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు.. చేతికి అందివచ్చిన కొడుకు.. త్వరలో డాక్టరై మా కష్టాలు తీర్చుతాడని కలలు గంటున్న ఆ పేరెంట్స్‌ ఆశలపై నీళ్లు చల్లి ప్రాణాలు తీసుకున్నాడు లోకేష్‌. కాగా, గతంలోనూ చదువుల ఒత్తడి.. ఇతర కారణాలతో మెడికోలో ఆత్మహత్య చేసుకున్న ఘటనలో చాలానే వెలుగుచూసిన విషయం విదితమే.

Read Also: Astrology: జూన్‌ 26, సోమవారం దినఫలాలు