Site icon NTV Telugu

Job Notifications: గుడ్‌న్యూస్.. ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ..

Medical&health Recruitment Board

Medical&health Recruitment Board

ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

READ MORE: IFSC Code: ఐఎఫ్ఎస్ సి కోడ్ అంటే ఏమిటి? ఇది ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసా?

మరో 3212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్‌, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1950 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి.. మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం 3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

READ MORE: Rashmika Mandanna: మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా సైన్ చేసిన నేషనల్ క్రష్షు

Exit mobile version