NTV Telugu Site icon

Car Fireaccident : అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం

Car Fire

Car Fire

Car Fireaccident : మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పై ఘోర ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరుగుతున్న మల్లన్న జాతరను తిలకించేందుకు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన నలుగురు యువకులు కారులో బయలుదేరారు. అయితే, ప్రయాణానికి కొద్దిసేపటికే పోచారం సమీపంలోని అన్నోజీ గూడ ఫ్లైఓవర్‌పైకి చేరుకునే సరికి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..

అప్రమత్తమైన యువకులు కారును వెంటనే పక్కకు నిలిపి, గట్టిగా పరుగులు తీశారు. క్షణాల్లోనే మంటలు కారును పూర్తిగా కబళించాయి. అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణించిన నలుగురికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాథమిక దర్యాప్తులో ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పూర్తి కారణాన్ని తెలియజేసేందుకు మరింత విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.

Indian Nationals Deported: 205 మంది భారతీయుల్ని బహిష్కరించిన ట్రంప్.. టెక్సాస్ నుంచి ఇంటికి….