Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గద్దెపై సమ్మక్క కొలువు తీరారు. దీంతో వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువు అయ్యింది. రెండో రోజు ప్రధాన ఘట్టాన్ని కనులారా వీక్షించి పొలకించిపోయారు భక్తులు. చిలకల గుట్ట వద్ద పూజలు చేసిన తర్వాత మేడారానికి సమ్మక్కను తీసుకొచ్చారు పూజారులు.
చిలకలగట్ట నుంచి అమ్మవారు కిందకి దిగే టైంలో గౌరవ సూచకంగా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోయ పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. తొలిరోజు కన్నెపల్లి, కొండాయి, పూనుగొండల నుంచి మేడారం చేరుకొని గద్దలపై కొలువు తీరారు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు. రెండో రోజు సాయంత్రం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి రావడంతో వనదేవతల దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు.
Quinton de Kock Century: రీఎంట్రీలో రెచ్చిపోతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్!
వనదేవతలకు బెల్లం మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. బెల్లం మొక్కులే కాదు.. ఎదుర్కోళ్ళ ఆచారం కూడా ఉంది. అందుకే అమ్మవారికి కోడిని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. మేడారం పరిసరాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. 8 కిలోమీటర్ల దూరం వరకు భక్తులు కనిపిస్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు ఏపీ, ఛత్తీస్గడ్ మహారాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
సామాన్యులే కాదు పలు రంగాల ప్రముఖులు పలు పార్టీల నేతలు వనదేవతల దర్శనాలకు తరలి వస్తున్నారు. ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్స్ సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారు. వనదేవతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు దర్శించుకున్నారు. సతీ సమేతంగా అమ్మవారులకు నిలువెత్తు బంగారం సమర్పించారు. సమ్మక్క సారలమ్మ దయతో తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు భట్టి విక్రమార్క. సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారాన్ని అభివృద్ధి చేసిన రేవంత్ సర్కార్ ను అభినందించారు. ఆదివాసీల డెవలప్మెంట్ కోసం కేంద్రం ఎంతో కృషి చేస్తుంది అన్నారు.
మేళారం జాతరకు రద్దీ పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో కనెక్టివిటీకి ఇబ్బంది అవుతుందని వాపోతున్నారు. మరోవైపు డిజిటల్ లావాదీవీల పైన సిగ్నల్ ఎఫెక్ట్ పడింది. ఏటీఎంలో అందుబాటులో లేకపోవడం డిజిటల్ లావాదేవీలు జరగకపోవడంతో వ్యాపారులు భక్తులను నగదు కొరత వేధిస్తోంది. పకట్టబంది నిఘా వ్యవస్థతో మహాజాతర కొనసాగుతోంది. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సిసీ కెమెరాలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 512GB స్టోరేజ్, 520Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో Red Magic 11 Air లాంచ్
ఈ జాతరలో గ్రూప్ వన్ ట్రైనీ ఆఫీసర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భక్తుల రద్ది నియంత్రణ గద్దల వద్ద పర్యవేక్షణ ట్రాఫిక్ విధుల్లో గ్రూప్ వన్ ట్రైనీ ఆఫీసర్లు భాగమయ్యారు. స్థానిక పోలీసులు ఆర్టిసి రెవెన్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ మహాజాతర నిర్వహణ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు వనజాతరలో టిజిఎస్ఆర్టిసి కీలక పాత్ర పోషిస్తోంది. జాతరకు తరలి వెళ్లే భక్తుల కోసం 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకటబంది ఏర్పాట్లు చేశారు.
అలాగే ఈ జాతరలో కోయ ధరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. జాతకాలు చెప్పడంతో పాటు తాయత్తులు కడుతున్నారు. అలాగే గాలి ధూళి సోకకుండా మూలికలు కూడా ఇస్తున్నారు. మేడారం జాత్ర రేపటితో ముగుస్తుంది. దేవతలు రేపు వనప్రవేశం చేస్తారు. దీంతో జాత్ర పరిసమాప్తం కానుంది. ఇవాళ లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకొనున్నారు.
