Site icon NTV Telugu

National Flag Hoisted: చూసుకోవాలి కదండీ.. తలక్రిందులుగా జెండా ఆవిష్కరణ..!

National Flag Hoisted

National Flag Hoisted

National Flag Hoisted: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఆర్టీవో కార్యాలయంలో జాతీయ జెండా అవమానానికి గురైన ఘటన కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఆర్డీవో మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను తలక్రిందులుగా ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది. జెండా ఆవిష్కరణ అనంతరం అక్కడ ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సూచించారు. దీంతో అప్రమత్తమైన ఆర్డీవో వెంటనే జెండాను సరిచేసి రెండోసారి సక్రమంగా ఎగరవేశారు. అయితే అప్పటికే ఈ ఘటనపై విమర్శలు మొదలయ్యాయి.

Nizamabad: గంజాయి స్మగ్లర్ల అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం!

జాతీయ జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమంలో ఈ తరహా నిర్లక్ష్యం ఎలా జరిగిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలాంటి తప్పిదం జరగడం బాధాకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Eesha Rebba: ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తో ‘రిలేషన్’పై ఓపెనైన ఈషా..!

Exit mobile version