కొల్చారం (మం) వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్- జోగిపేట రోడ్డు పక్కన కారులో అనిల్(45) మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Promotions : ఇంటర్ డిపార్ట్‌మెంట్ పరిధిలో 81 మందికి ప్రిన్సిపాల్ పదోన్నతులు
అనిల్ ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యా చేసి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లేక ఇంక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనిల్ మృతితో కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.
